|
|
by Suryaa Desk | Sat, Dec 20, 2025, 11:35 AM
పటాన్‌చెరు పట్టణంలోని ముదిరాజ్ భవన్‌లో కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్ గారి వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాద్రి పృథ్వీరాజ్ ముదిరాజ్ పాల్గొని ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా మాద్రి పృథ్వీరాజ్ ముదిరాజ్ గారు మాట్లాడుతూ, కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్ గారు హైదరాబాద్ నగరానికి తొలి మేయర్‌గా పనిచేస్తూ బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం నిరంతరం పోరాడిన మహానీయులని తెలిపారు. రాజకీయాల్లో విలువలు, నిజాయితీ, ప్రజాసేవకు ఆయన ఒక చిరస్మరణీయ ప్రతీక అని పేర్కొన్నారు.ముదిరాజ్ సమాజానికి రాజకీయ గుర్తింపు తీసుకురావడంలో కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్ గారి పాత్ర చరిత్రలో నిలిచిపోతుందని, నేటి యువత ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని రాజకీయాల్లోకి వచ్చి ప్రజాసేవ చేయాల్సిన అవసరం ఉందని పృథ్వీరాజ్ గారు పిలుపునిచ్చారు.సమాజానికి న్యాయం జరగాలంటే రాజకీయంగా బలంగా ఉండాల్సిందేనని, అందుకు ఐక్యతతో ముందుకు సాగాలని ఆయన అన్నారు. కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్ గారు చూపిన మార్గంలో నడవడమే ఆయనకు నిజమైన నివాళి అని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం సభ్యులు పాల్గొన్నారు.