|
|
by Suryaa Desk | Sat, Dec 20, 2025, 10:32 AM
తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా ఏజెన్సీ, మైదాన ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. అనేక ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అల్లూరి జిల్లా డుంబ్రిగూడలో అత్యల్పంగా 4.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవగా.. కొమురంభీమ్ ఆసిఫాబాద్ లో 6.2 డిగ్రీలు, మంచిర్యాలలో 6.5, సంగారెడ్డి, నిజామాబాద్ లో 6.7, భూపాలపల్లిలో 6.8, నిర్మల్ లో 6.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.