|
|
by Suryaa Desk | Fri, Dec 19, 2025, 12:41 PM
కొత్తగూడెం జిల్లా మణుగూరులో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పర్యటించారు. మణుగూరు పీకే ఓసీ 2 ప్రైవేటీకరణకు కేంద్రం టెండర్లు పిలుస్తుందని, ఇది జరిగితే మణుగూరు మనుగడ ప్రశ్నార్థకమవుతుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. మరో మూడేళ్లలో మణుగూరులో సింగరేణి ఉండదని, ప్రజలు భయాందోళన చెందుతున్నారని తెలిపారు. ఈ ప్రైవేటీకరణను ఆపాలని డిమాండ్ చేస్తూ, లేదంటే కార్మికుల పక్షాన హెచ్ఎంఎస్ తో కలిసి తెలంగాణ జాగృతి పోరాటం చేస్తుందని కవిత హెచ్చరించారు.