|
|
by Suryaa Desk | Thu, Dec 18, 2025, 07:55 PM
వేములవాడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం జరిగిన సమావేశంలో వేములవాడ అర్బన్ మండల సర్పంచ్ల ఫోరం కార్యవర్గాన్ని నియమించారు. మొదటి రెండున్నర సంవత్సరాలకు శభాష్‌పల్లి సర్పంచ్ అన్నబోయిన తిరుపతి యాదవ్ అధ్యక్షుడిగా, తర్వాతి రెండున్నర సంవత్సరాలకు ఆరేపల్లి సర్పంచ్ ఇటిక్యాల రాజు అధ్యక్షుడిగా కొనసాగుతారు. ఉపాధ్యక్షులుగా అనుపురం సర్పంచ్ శేర్ల రాజేశ్వరి మల్లేశం, కొడుముంజ సర్పంచ్ కదిరే రాజు, ప్రధాన కార్యదర్శిగా కొలుగూరి మధు కిరణ్మయి, అధికార ప్రతినిధిగా గుర్రం వానిపల్లి సర్పంచ్ జ్వాల స్వాతి సురేష్ రెడ్డి, కార్యదర్శిగా మారుపాక సర్పంచ్ దొబ్బల మల్లేశం, ముఖ్య సలహాదారుగా ఇటిక్యాల రాజులను నియమించారు.