|
|
by Suryaa Desk | Fri, Dec 19, 2025, 11:32 AM
శంషాబాద్ BRS జిల్లా పార్టీ కార్యాలయంలో రాజేంద్రనగర్ నియోజకవర్గం ఇన్చార్జీ కార్తీక్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. శంషాబాద్ మున్సిపల్ ను చార్మినార్ జోన్ లో విలీనం చేస్తే ప్రజలకు సమస్యలు వస్తాయని ఆయన అన్నారు. శంషాబాద్ డివిజన్ లో కార్పోరేట్ సీట్లను 5 వరకు పెంచాలని డిమాండ్ చేశారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఏ పార్టీలో ఉన్నారో స్పష్టం చేయాలని, ఆయన కాంగ్రెస్ లో ఉన్నారా లేక BRS లో ఉన్నారా అనేది ప్రజలకు అర్థం కావడం లేదని కార్తీక్ రెడ్డి పేర్కొన్నారు. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ కండువా కప్పుకొని, బయట మాత్రం BRS పార్టీ అని చెప్పుకుంటున్నారని, ఆయన రాజకీయ స్థానం ఏమిటో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. అభివృద్ధి కోసం ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ లోకి వెళ్తే, గత రెండేళ్లలో ఆయన ఏం అభివృద్ధి చేశారో ప్రజలకు చెప్పాలని అన్నారు.