|
|
by Suryaa Desk | Fri, Dec 19, 2025, 10:36 AM
కేంద్ర గ్రామీణభివృద్ధిశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ను మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ గురువారం ఢిల్లీలో కలిశారు. మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధిలోని వెనుకబడిన ప్రాంతాలలో రోడ్ల కనెక్టివిటీ లేకపోవడం వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఎంపీ వివరించారు. గతంలో పంపిన ప్రతిపాదనలలో కొన్ని గ్రామాలకు DPRల తయారీకి NRIDA ఆమోదం తెలిపిందని, పెండింగ్ లో ఉన్న కనెక్టివిటీ పనులను వెంటనే ప్రారంభించాలని ఆమె కేంద్ర మంత్రిని కోరారు.