|
|
by Suryaa Desk | Thu, Dec 18, 2025, 07:46 PM
మంథని మండలం లో మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో స్వతంత్రంగా గెలిచిన గుంజపడుగు, గుమ్మునూరు గ్రామపంచాయతీల నూతన సర్పంచులు దండేవేన సంధ్య, బానేష్, చెరుకుతోట సురేష్ తో పాటు మరికొందరు గురువారం హైదరాబాదులో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంత్రి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించి, గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసి చైర్మన్ కుడుదుల వెంకన్న, మండల అధ్యక్షులు ఐలి ప్రసాద్, పెద్దపల్లి జిల్లా సోషల్ మీడియా ఇంచార్జి అరెల్లి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.