|
|
by Suryaa Desk | Fri, Dec 19, 2025, 08:47 AM
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్రంగా స్పందించారు. "అనేకసార్లు చెప్పా.. మళ్లీ చెబుతున్నా.. రాసి పెట్టుకోండి రేవంత్‌రెడ్డి.. ఎప్పటికైనా నా గుండెల్లో ఉండేది కేసీఆరే. నా చేతిలో ఉండేది గులాబీ జెండానే" అని ఆయన స్పష్టం చేశారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలతో సీఎంకు అసహనం పెరిగిపోయిందని, ఓటమి భయంతోనే తనకూ, కేటీఆర్‌కు మధ్య విభేదాలు సృష్టించి బీఆర్ఎస్‌ను బలహీనపరచాలని చూస్తున్నారని ఆరోపించారు.గురువారం ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రోజురోజుకీ పరిస్థితులు చేయిదాటిపోతున్నాయనే ఆందోళనతోనే సీఎం ఇష్టానుసారం మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆయన చేస్తున్న కుట్రలు, కుతంత్రాలు ఫలించవని హరీశ్‌రావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ అక్రమాలపై తానూ, కేటీఆర్ మరింత సమన్వయంతో, రెట్టించిన ఉత్సాహంతో పోరాడతామని తెలిపారు. తెలంగాణకు ద్రోహం చేస్తున్న కాంగ్రెస్‌ను గద్దె దించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.