|
|
by Suryaa Desk | Fri, Dec 19, 2025, 12:26 PM
నైట్ షిఫ్ట్ ఉద్యోగాలు చేసేవారు నిద్ర, ఆహార విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే దీర్ఘకాలంలో డయాబెటిస్, హార్మోనల్ ఇంబాలెన్స్ వంటి అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాత్రిపూట తేలికపాటి ఆహారం తీసుకోవాలి, జంక్ ఫుడ్ మానుకోవాలి. రోజుకు 3-4 లీటర్ల నీరు తాగాలి. పగటిపూట 7-8 గంటలు నిద్రపోవాలి. నిద్రలేచిన తర్వాత కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయాలి. స్థిరమైన దినచర్యను పాటించడం ద్వారా శరీరం బయో క్లాక్‌ను సరిచేసుకుంటుంది.