|
|
by Suryaa Desk | Fri, Dec 19, 2025, 03:13 PM
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్యం మీద, వయసు మీద సీఎం రేవంత్ అవహేళన చేసి మాట్లాడుతున్నారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. 'మరి అంత ఆరోగ్యంగా ఉన్న రాహుల్ గాంధీ దేశ వ్యాప్తంగా పర్యటన చేస్తే బీహార్‌లో ఎందుకు 6 సీట్లే వచ్చాయి రేవంత్ రెడ్డి? సోనియా గాంధీ అనారోగ్యంగా ఉన్నారు కాబట్టి వారు ప్రజా క్షేత్రంలో తిరగడం లేదని మేము ఎప్పుడైనా అన్నామా?' అని కౌంటర్ ఇచ్చారు