|
|
by Suryaa Desk | Fri, Dec 19, 2025, 02:45 PM
కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని తిమ్మాయిపల్లి మల్లన ఆలయం సమీప అటవీప్రాంతంలో గుర్తు తెలియని మహిళ అస్థిపంజరం లభ్యమైంది. కీసర ఇన్స్పెక్టర్ ఆంజనేయులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతి చెందినది మహిళ అని, సంఘటన జరిగి రెండు మూడు నెలలు అయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. క్లూస్ టీం రంగంలోకి దిగింది. కీసర పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల మహిళల మిస్సింగ్ కేసులపై కీసర సీఐ ఆరా తీస్తున్నారు. ఎవరైనా మహిళలు తప్పిపోయి ఉంటే కీసర పోలీస్ స్టేషన్ ను సంప్రదించాలని సూచించారు.