|
|
by Suryaa Desk | Fri, Dec 19, 2025, 02:38 PM
వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల వెన్నుపోటు రాజకీయాలపై తీవ్రంగా మండిపడ్డారు. శుక్రవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, కాంగ్రెస్ జెండా మోసిన కార్యకర్తలకు నష్టం వాటిల్లిందని ఆరోపించారు. ఇటీవల జరిగిన గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పాలనపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారని, తమ అభ్యర్థులకు మద్దతు తెలిపిన ఓటర్లకు, ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. సీనియర్ నాయకుల ద్రోహాన్ని మేధావులు, ప్రజలు గమనిస్తున్నారని, వారు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేస్తానని తెలిపారు.