|
|
by Suryaa Desk | Sat, Dec 20, 2025, 12:19 PM
పటాన్చెరు డివిజన్ పరిధిలోని ఆల్విన్ కాలనీలో గల శ్రీ బండల మల్లన్న స్వామి వారి ఆలయ జాతర ప్రత్యేక జనవరి మాసంలో నిర్వహించడం జరుగుతుంది. కాగా వచ్చే నెలలో జరగబోయే స్వామివారి జాతర మహోత్సవ ఏర్పాట్ల నిమిత్తం ఈ రోజు పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ గారు శ్రీ బండల మల్లన్న స్వామి వారి ఆలయాన్ని సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ గారు ఆలయ ప్రాంగణంలో పారిశుద్ధ్య పనులు పూర్తి చేయాలని GHMC SFA నవీన్ రెడ్డి గారిని ఆదేశించడం జరిగింది. అలాగే ఆలయ పరిసరాల్లో చెత్తాచెదారం,పిచ్చి మొక్కలను తొలగించేందుకు బుల్డోజర్ యంత్రాలను పురమాయించడం జరిగింది. ప్రతి ఏటా జనవరి మాసంలో ఘనంగా నిర్వహించే శ్రీ మండల మల్లన్న స్వామి వారి ఆలయ జాతర మహోత్సవాలను ఈసారి కూడా అంగరంగ వైభవంగా నిర్వహించబోతున్నామని అందుకొరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని కార్పొరేటర్ గారు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో BRS టౌన్ ప్రెసిడెంట్ నాగరాజు యాదవ్ గారు,బండ్లగూడ టౌన్ ప్రెసిడెంట్ భరత్ గారు, మల్లేష్ యాదవ్ గారు,లక్ష్మణ్ యాదవ్ గారు,కృష్ణ యాదవ్ గారు,మహేష్ యాదవ్ గారు,మెట్టు కళ్యాణ్ యాదవ్ గారు,సాయి చరణ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.