|
|
by Suryaa Desk | Sat, Dec 20, 2025, 02:43 PM
మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శనివారం యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి భంగపాటు తప్పదని అన్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌కు చెంపపెట్టు అని, వెయ్యిలోపు ఓట్లు ఉన్న గ్రామాల్లో మాత్రమే కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారని అన్నారు. మేజర్ పంచాయతీలన్నీ బీఆర్ఎస్ పార్టీనే కైవసం చేసుకుందని తెలిపారు