|
|
by Suryaa Desk | Sat, Dec 20, 2025, 01:16 PM
మండల పరిధిలోని మేకగూడ శివారులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కొనకాని సుమిత్ర (30) అనే మహిళ మృతి చెందింది. పొలం వద్దకు స్కూటీపై వెళ్తున్న సుమిత్రను, కొత్తూరు మండలం ఇన్ముల్నర్వ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అతివేగంగా, అజాగ్రత్తగా నడిపిన కారు ఢీకొట్టింది. శుక్రవారం ఈ ప్రమాదంలో సుమిత్ర అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం షాద్నగర్ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు. మృతురాలికి ఇద్దరు కొడుకులు ఉండగా, భర్త ఇటీవలే మృతి చెందాడు.