|
|
by Suryaa Desk | Mon, Dec 22, 2025, 01:59 PM
న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. అర్ధరాత్రి పూట రాచకొండ కమిషనరేట్ పోలీసులు స్పెషల్ ఆపరేషన్ నిర్వహించి, బాలాపూర్ హోటల్స్, క్రికెట్ గ్రౌండ్స్‌లో తనిఖీలు చేపట్టారు. రాత్రిపూట గేమ్స్, అనుమతి లేకుండా వేడుకలు నిర్వహించకూడదని నిర్వాహకులకు, హోటల్ యజమానులకు పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.