|
|
by Suryaa Desk | Sat, Dec 20, 2025, 03:30 PM
TG: భద్రాద్రి కొత్తగూడెం(D) పాల్వంచలో సంచలనం సృష్టించిన హరినాథ్ మృతి కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. భార్య తన ప్రియుడితో కలిసి హత్య చేసిందని పోలీసులు దర్యాప్తులో తేల్చారు. పాల్వంచకు చెందిన ధరావత్ హరినాథ్ భార్య శృతిలయ ప్రస్తుతం ములుగు జిల్లాలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌గా పనిచేస్తోంది. ఆమెకు కొండా కౌశిక్ అనే యువకుడితో ఎఫైర్ ఉంది. ఈ విషయం తెలిసి భర్త హరినాథ్ మందలించడంతో అతడి అడ్డుతోలగించాలని ప్లాన్ వేసింది. ఈ నెల 15న శృతిలయ తన ప్రియుడు, అతని స్నేహితులతో కలిసి హరినాథ్‌ను గొంతునులిమి హత్య చేసింది.