|
|
by Suryaa Desk | Sat, Dec 20, 2025, 03:35 PM
జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల సందర్భంగా, జిల్లాలో ఆటో, ట్రాక్టర్, కార్, లారీ, బస్సు డ్రైవర్లకు రహదారి భద్రతపై అవగాహన సదస్సులు నిర్వహిస్తామని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. విద్యార్థులకు వ్యాస రచన, డ్రాయింగ్ పోటీలు, స్కూల్ మేనేజ్మెంట్ సమావేశాల్లో ఈ అంశంపై చర్చలు చేపడతామని పేర్కొన్నారు. నేషనల్ హై వే, ఆర్అండ్ బీ, పీఆర్, పోలీస్, రవాణా శాఖా అధికారులు సంయుక్తంగా సర్వే నిర్వహించి, బ్లాక్ స్పాట్లు గుర్తించి, వాటి పరిష్కారానికి ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ చంద్రయ్య, జిల్లా రవాణా శాఖా అధికారి లక్ష్మణ్, జిల్లా రోడ్ సేఫ్టీ కమిటీ సభ్యుడు సంగీతం, పీఆర్ ఈఈ సుదర్శన్ రెడ్డి, ఆర్అండ్ బీ డీఈ శాంతయ్య, మున్సిపల్ కమిషనర్లు ఖదీర్ పాషా, అన్వేష్, జిల్లా వైద్యాధికారి రజిత, విద్య శాఖా అధికారులు, ట్రాఫిక్ పోలీస్ లు పాల్గొన్నారు.