|
|
by Suryaa Desk | Sun, Dec 21, 2025, 03:16 PM
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని వివిధ కాలనీల వెల్ఫేర్ అసోసియేషన్ వారు ఆదివారం నాడు కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ కు వినతి పత్రం సమర్పించారు. కెపిహెచ్బి నుండి గాజుల రామారం వరకు 100 ఫీట్ల రోడ్డు విస్తరణ, మరియు శ్రీవేణి ఎంక్లేవ్ నుండి మెట్కన్ గూడా మీదుగా సూరారం వరకు 60 ఫీట్ల రోడ్డు విస్తరణ చేపట్టాలని వారు కోరారు. ఈ రోడ్లు ఇరుకుగా ఉండటం వల్ల నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని, వేలాది మంది ప్రజలు ప్రయాణిస్తున్నారని వారు పేర్కొన్నారు.