|
|
by Suryaa Desk | Sun, Dec 21, 2025, 03:20 PM
అమీన్పూర్ : అమీన్పూర్ డివిజన్ పరిధిలోని కిష్టారెడ్డిపేట మైత్రి విల్లాస్ కాలనీలో ఆదివారం పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి గారు పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రధానంగా డ్రైనేజీ, స్ట్రీట్ లైట్లను అతి త్వరలో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు.