|
|
by Suryaa Desk | Sun, Dec 21, 2025, 03:04 PM
హైదరాబాద్ సీపీ సజ్జనార్ వాట్సాప్‌లో 'ఘోస్ట్ పెయిరింగ్' పేరుతో కొత్త స్కామ్ జరుగుతోందని హెచ్చరించారు. 'Hey.. మీ ఫొటో చూశారా?' అంటూ వచ్చే లింక్‌లను క్లిక్ చేయవద్దని, అలా చేస్తే హ్యాకర్ల డివైజ్‌కు మీ అకౌంట్ కనెక్ట్ అయి, మీ పర్సనల్ డేటాను దుర్వినియోగం చేసి మోసాలకు పాల్పడతారని తెలిపారు. వాట్సాప్ సెట్టింగ్స్‌లోని 'Linked Devices' ఆప్షన్‌ను పరిశీలించి, తెలియని డివైజ్‌లను తొలగించుకోవాలని సూచించారు.