|
|
by Suryaa Desk | Mon, Dec 22, 2025, 01:21 PM
తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి వారి ఆలయ అభివృద్ధి పనుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.35.19 కోట్ల నిధులను మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు, టీటీడీ ఛైర్మన్ పవన్ కల్యాణ్ ఎక్స్ వేదికగా కృతజ్ఞతలు తెలియజేశారు.2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత తన ఇలవేల్పు శ్రీ ఆంజనేయ స్వామికి మొక్కులు చెల్లించుకునేందుకు కొండగట్టు క్షేత్రాన్ని దర్శించుకున్నానని, ఆ సమయంలో దేవస్థానంలో మౌలిక సదుపాయాలపై భక్తుల నుంచి వినతులు అందాయని ఆయన అన్నారు. దీనిపై ఆలయం వద్ద అభివృద్ధి పనుల కోసం తాను టీటీడీకి ప్రతిపాదన పంపగా, ఆ మేరకు రూపొందించిన ప్రతిపాదనలకు టీటీడీ ఆమోదం తెలిపిందని తెలిపారు.ఈ నిధులతో భక్తుల సౌకర్యార్థం దీక్ష విరమణ మంటపం, 96 గదులతో భారీ సత్రం నిర్మాణం చేపట్టనున్నట్లు పవన్ తెలిపారు. ఈ నేపథ్యంలో నిధులు మంజూరు చేసిన టీటీడీ ఛైర్మన్ బి.ఆర్. నాయుడు, పాలక మండలి సభ్యులు, టీటీడీ ఈవో, అడిషనల్ ఈవో, జేఈవోలకు పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు.