|
|
by Suryaa Desk | Mon, Dec 22, 2025, 02:06 PM
జగిత్యాల జిల్లా, జగిత్యాలలోని మల్లాపూర్ మేజర్ గ్రామపంచాయతీలో ఏడు సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత నూతన పాలకవర్గం కొలువుదీరింది. కొత్తగా ఎన్నికైన సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్, ఉప సర్పంచ్ గడ్డం సోమారెడ్డి, వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేసి పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ పరిణామంతో గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నూతన పాలకవర్గం సమన్వయంతో పనిచేస్తూ, గ్రామ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.