|
|
by Suryaa Desk | Mon, Dec 22, 2025, 04:12 PM
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని మహిళా సంఘాలకు గుడ్‌న్యూస్ అందించింది. మహిళలను ఆర్ధికంగా ప్రోత్సహించేందుకు డెయిరీ రంగంలో అవకాశాలు కల్పించనుంది. అందులో భాగంగా రాష్ట్రంలోని విజయ డెయిరీ పార్లర్లను మహిళలకు కేటాయించాలని నిర్ణయించింది. ఇందిరా మహిళా శక్తి పథకం పేరుతో దీనిని అమలు చేయనుంది. వారం పది రోజుల్లో ఈ పథకం అమలుకు సంబంధించిన విధివిధానాలను ప్రభుత్వం ఖరారు చేసి పార్లర్లను కేటాయించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి మండలానికి ఒకటి చొప్పున రాష్ట్రవ్యాప్తంగా కేటాయించనున్నారు.