|
|
by Suryaa Desk | Tue, Dec 23, 2025, 08:10 PM
తెలంగాణలో ఉప సర్పంచ్‌లకు చెక్ పవర్ రద్దు చేసినట్లు వార్తలు విస్తృతంగా ప్రచారం అవుతున్న విషయం తెలిసిందే. అయితే, ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సర్క్యూలర్ పూర్తిగా ఫేక్ అని అధికారులు కొట్టిపారేస్తున్నారు.ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో నూతన పాలకవర్గాలు బాధ్యతలు చేపట్టాయి. అన్ని గ్రామ పంచాయతీల్లో అధికారులు కొత్తగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులతో ప్రమాణ స్వీకారాలు చేయించారు. అనంతరం గ్రామ పంచాయతీలకు సంబంధించిన పరిపాలనా బాధ్యతలను వారికి అప్పగించారు. దీంతో ఇప్పటి వరకు కొనసాగిన ప్రత్యేక అధికారుల పాలనకు ముగింపు పలికినట్టైంది.ఇదిలా ఉండగా, 2018 పంచాయతీరాజ్ చట్టం ప్రకారం గ్రామ పంచాయతీల్లో ఉప సర్పంచ్‌కు జాయింట్ చెక్ పవర్ ఉండటంతో ఆ పదవికి కీలక ప్రాధాన్యం ఏర్పడింది. ఈ నేపథ్యంలో వైరల్‌గా మారిన సర్క్యూలర్‌పై స్పష్టత కోసం ఈ లింక్‌ను పరిశీలించవచ్చు.