|
|
by Suryaa Desk | Tue, Dec 23, 2025, 12:14 PM
చున్నీతో గొంతు నులిమి హత్య చేసి గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నం.. పోస్టుమార్టం రిపోర్టుతో బయటపడ్డ బాగోతం. హైదరాబాద్ – మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బృందావన్ కాలనీలో 12 ఏళ్ల క్రితం వివాహం చేసుకుని,తమ కొడుకు(11)తో కలిసి నివాసం ఉంటున్న వీకే అశోక్(45), పూర్ణిమ(36) అనే దంపతులు. అశోక్ ప్రైవేటు కాలేజీలో పని చేస్తుండగా, ఇంటివద్ద పిల్లలకు ట్యూషన్లు చెప్తూ జీవనం కొనసాగిస్తున్న కుటుంబం . ఇటీవల అదే కాలనీకి చెందిన పాలేటి మహేష్(22) అనే వ్యక్తితో పూర్ణిమకు పరిచయం ఏర్పడి, వివాహేతర సంబంధంగా మారడంతో, పలుమార్లు హెచ్చరించిన అశోక్. దీంతో భర్తను హతమారిస్తే తమ ప్రేమకు అడ్డు ఎవరూ ఉండరని భావించి, ప్రియడు మహేష్, అతని స్నేహితుడు సాయితో కలిసి పథకం వేసిన పూర్ణిమ. ఈ నెల 11వ తేదీన అశోక్ విధులు ముగించుకుని ఇంటికి రాగా, పూర్ణిమతో కలిసి అతని గొంతుకు చున్నీ బిగించి హతమార్చిన ప్రియుడు మహేష్, అతని స్నేహితుడు సాయి. అనంతరం తన భర్త గుండెపోటుతో మరణించాడని పోలీసులకు ఫిర్యాదు చేసిన పూర్ణిమ. పూర్ణిమ మీద అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన అశోక్ కుటుంబ సభ్యులు . పోస్టుమార్టం రిపోర్టులో గొంతుకు ఉరివేసి హతమార్చినట్లు తేలడంతో పోలీసులు విచారించగా, తామే హత్య చేసినట్లు అంగీకరించిన పూర్ణిమ, అతని ప్రియుడు./ దీంతో పూర్ణిమ, మహేష్, సాయిలను అరెస్టు చేసి, రిమాండుకు తరలించిన పోలీసులు