|
|
by Suryaa Desk | Tue, Dec 23, 2025, 03:07 PM
వచ్చే ఏడాది ఏప్రిల్ 1, 2026 నుంచి ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ ప్రజల సోషల్ మీడియా ఖాతాలు, ఈమెయిల్స్, ఇతర డిజిటల్ వేదికలపై నిఘా పెట్టనుందంటూ జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ వార్త పూర్తిగా తప్పుదోవ పట్టించేలా ఉందని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఫ్యాక్ట్ చెక్ విభాగం తేల్చి చెప్పింది.కొత్త ఆదాయపు పన్ను చట్టం, 2025 ప్రకారం పన్ను ఎగవేతలను అరికట్టేందుకు ఐటీ అధికారులకు ఈ విస్తృత అధికారాలు కల్పించారంటూ కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ విపరీతంగా వైరల్ అవుతోంది. దీంతో పౌరుల వ్యక్తిగత గోప్యతకు భంగం కలుగుతుందనే ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన పీఐబీ దీనిపై స్పష్టతనిచ్చింది. ఈ నిబంధనలు కేవలం పన్ను ఎగవేతకు సంబంధించి ఐటీ శాఖ నిర్వహించే అధికారిక సోదాలు, సర్వే ఆపరేషన్లకు మాత్రమే వర్తిస్తాయని స్పష్టం చేసింది.