|
|
by Suryaa Desk | Tue, Dec 23, 2025, 03:13 PM
లోక రక్షకుడైన ఏసుక్రీస్తు మానవాళి పాపముల నిమిత్తం నరరూపంలో జన్మించి, సగం దైవత్వం, సగం మానవత్వం కలిగి, తన పవిత్ర రక్తాన్ని చిందించి తిరిగి లేచాడని ఈ వేడుక జరుపుకుంటారు. సామవేదంలోని శతపథ బ్రాహ్మణంలో 'పరమాత్మ బలియాగం'కు సంబంధించిన ఒక ముఖ్యమైన శ్లోకం ఉంది: "సర్వ పాప పరిహరో రక్త ప్రోక్షణమవశ్యం తద్రక్తం పరమాత్మేన పున్యదాన బలియాగం". దీని తెలుగు అనువాదం, "సమస్త పాపాలు తొలగిపోవాలంటే రక్తంతో ప్రోక్షణం (చల్లడం) అవసరం; ఆ రక్తం పరమాత్మ తనను తానే పుణ్యదానంగా బలిగా అర్పించడం" అని అర్థం. ఈ శ్లోకం పరమాత్మ యొక్క అత్యున్నత త్యాగాన్ని, దాని ద్వారా పాప పరిహారాన్ని సూచిస్తుంది. ఏసుక్రీస్తు బెత్లహేములోని వడ్లవాని కుటుంబంలో జన్మించాడు.