|
|
by Suryaa Desk | Tue, Dec 23, 2025, 10:39 AM
వివిధ రాష్ట్రాల్లో వివిధ పేర్లతో పిలువబడుతున్న ముదిరాజ్ (కోలీలను) అందరిని ఒకే గొడుగు కిందికి తీసుకరావడం కష్టమైన పని అయినప్పటికీ అందరిని ఒక్కతాటికి తీసుకురావడానికి కోలీ సమాజ్ పూర్తిస్థాయిలో కృషి చేయాలలి మల్కాజగిరి పార్లమెంట్ సభ్యులు, తెలంగాణ ఆర్థిక శాఖ మాజీ మాత్యులు ఈటెల రాజేంద్ర ముదిరాజ్ పిలుపునిచ్చారు.కర్ణాటక రాజధాని బెంగళూరు లోని KTE భవన్ లో కోలి (ముదిరాజ్) సమాజ్ జాతీయ కార్యవర్గ సమావేశం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.ఢిల్లీ స్థాయిలో మన బలము మన బలగం ఎంతో చూపించాలని ఆయన కోరారు. ఈ మేరకు దేశంలోని అనేక రాష్ట్రాల్లో వివిధ పేర్లతో పిలవబడుతున్న వారు ఒక్కొక్క చోట ఒక్కొక్క రిజర్వేషన్ల వల్ల అనేక ఇబ్బందులకు గురవుతున్నారని దీనిపై అందరూ సమిష్టిగా నిర్ణయించి అందరికీ ఒకే రిజర్వేషన్ వచ్చే విధంగా గతంలో రామ్ నాథ్ కోవింద్ కోలి తో కలిసి 2016లో నాందేడ్ లోనిర్వహించిన సమావేశంలో తాను పాల్గొన్నానని ఆ తర్వాత ఇది రెండవదని ఈటెల రాజేందర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది జనాభా ఉన్న ముదిరాజులు రాజకీయంగా ఎదగలేక పోవడం వలన ఇబ్బందులకు గురికావాల్సి వస్తుందని, రికార్డు స్థాయిలో మన వారికి గత శాసనసభ ఎన్నికలలో సీట్లు ఇప్పించినప్పటికీ గెలవలేకపోయామని దానికి కారణాలు వేరని అన్నారు. రాష్ట్ర ములో 60 నియోజకవర్గాల్లో గెలుపు ఓటములను నిర్ణయించే శక్తి మనకు ఉందని కానీ రాజకీయంగా ఆర్థికంగా అంతగా రాణించకపోవడం వలన మనము వెనుకబడి ఉన్నామని పేర్కొన్నారు. వివిధ రాష్ట్రాల్లో వివిధ పేర్లతో పిలువబడుతున్న వారందరినీ ఒకే వేదిక మీదకి తీసుకువచ్చి ఢిల్లీ స్థాయిలో మన బలాన్ని మన శక్తిని ప్రదర్శించాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. అఖిల భారత కోలీ సమాజ్ జాతీయ అధ్యక్షులు మాజీ పార్లమెంట్ సభ్యులు వీరేంద్ర కషప్ మాట్లాడుతూ వివిధ రాష్ట్రాల్లో రిజర్వేషన్లు అనుకూలంగా లేకపోవడం వల్ల కొన్ని చోట్ల మనలను అంటరాని వారిగా చూస్తున్నారని దీనికి వ్యతిరేకంగా యువతరం ముందుకు వచ్చి ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. వ్యసనాలకు వ్యతిరేకంగా గతంలో కోలి సమాజ్ ఇచ్చిన పిలుపుమేరకు వివిధ రాష్ట్రాల్లో మంచి స్పందన లభించిందని ఆస్పూర్తిని కొనసాగించాలని పిలుపునిచ్చారు. కొన్ని రాష్ట్రాల్లో ఎస్సీలుగాను కొన్ని రాష్ట్రాల్లో ఎస్టీలు గాను మరికొన్ని రాష్ట్రాల్లోఓబీసీ లుగా బీసీలుగా ఉన్న వారందరిని వారందరికీ ఒకే రిజర్వేషన్ కోసం పార్లమెంటులో ప్రస్తావించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.కొన్ని ప్రాంతాల్లో కో లీలను అంటరాని వారిగా చూస్తున్నారని ఇది ఎంత మాత్రం సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు అనేక రాష్ట్రాలలో మన సంఖ్య బలం లక్షలాది ఉన్నప్పటికీ దానిని మనము ఒక బలమైన శక్తిగా రూపొందించలేకపోతున్నామని అన్నారు దీనిని అధిగమించడానికి ఈటెల రాజేందర్ గారి సూచన మేరకు ఢిల్లీ స్థాయిలో మన శక్తి ప్రదర్శన నిర్వహించాల్సి ఉందని ఆయన పిలుపునిచ్చారు. అంతే కాకుండా కోలీ సమాజ్ లో పనిచేస్తున్న మహిళలను సైతం సంఘటితం చేసి సామాజిక రుగ్మతలకు వ్యతిరేకంగా ఉద్యమించే విధంగా కార్యచరణ రూపొందించాలని అఖిలభారత కోలీ సమాజ్ మహిళా విభాగం జాతీయ అధ్యక్షురాలు ద్రౌపది కోలికి సూచించారు. కర్ణాటక రాష్ట్ర అధ్యక్షుడు దత్తాత్రేయ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన *జాతీయ కార్యవర్గ సమావేశాల్లో వర్కింగ్ ప్రెసిడెంట్లు రోటం భూపతి ముదిరాజ్, హరి శంకర్ మహోర్ అజిత్ భాయ్ పటేల్ మనోజ్ భాయ్ చావుడా, జాతీయ ప్రధాన కార్యదర్శి దయానంద్ ప్రసాద్ శంకవర్, హిమాచల్ అధ్యక్షులు అమర్చంద్ సలాత్, మహిళా విభాగం జాతీయ అధ్యక్షురాలు ద్రౌపతి, ఉత్తర ప్రదేశ్ మహిళా విభాగం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కనకబాయి, రంజిత, కర్ణాటక రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి అనితకంబర్, రాష్ట్ర అధ్యక్షులు లయన్ హనుమంతరావు, జాతీయ కార్యవర్గ సభ్యులు డాక్టర్ బొజ్జ నారాయణ ముదిరాజ్, తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు గొడుగు శ్రీనివాస్ ముదిరాజ్, రావుల రాజేందర్ ముదిరాజ్, అందే బాబయ్య ముదిరాజ్, మన ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సలేంద్ర శివయ్య ముదిరాజ్, రైల్వే రిటైర్డ్ పి ఆర్ ఓ బొజ్జ అనిల్, ముదిరాజ్ మహాసభ జిల్లా ఉద్యోగుల విభాగం కన్వీనర్ వన్యబోయిన చిన్నయ్య ముదిరాజ్, గురునాథం ముదిరాజ్ శివకుమార్ బి రెడ్డి వెంకటేశ్వర్ రామకృష్ణ మహారాష్ట్రకు చెందిన సిద్ధార్థ ,పుష్పతాయి గుజరాత్ రాష్ట్ర యూత్ అధ్యక్షులు దివేష్ చావడ, కర్ణాటక యూత్ అధ్యక్షులు నర్సింగ్ కోలీ తో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన అధ్యక్షులు ప్రధాన కార్యదర్శిలు వివిధ విభాగ్యులకు చెందిన నాయకులు పాల్గొన్నారు.*