|
|
by Suryaa Desk | Tue, Dec 23, 2025, 03:23 PM
అజ్మపురం గ్రామ పంచాయతీ నూతన సర్పంచ్ గుండాల నాగమణి శ్రీనివాస్ యాదవ్ తన గ్రామ ప్రజలకు సేవ చేసే అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. గతంలో ఎంపిటిసిగా సేవలు అందించిన తనకు, యువత మరొక్కసారి సర్పంచ్‌గా అవకాశం ఇచ్చారని ఆయన అన్నారు. ప్రజల నమ్మకాన్ని కాపాడుకుంటూ, నిత్యం అందుబాటులో ఉంటూ గ్రామ సమస్యలను పరిష్కరించి, పంచాయతీ అభివృద్ధికి తోడ్పడతానని ఆయన హామీ ఇచ్చారు.