|
|
by Suryaa Desk | Tue, Dec 23, 2025, 07:52 PM
శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని సురభి కాలనీలో పార్క్ అభివృద్ధి పనులను కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అధికారులతో కలిసి ప్రారంభించారు. వాకర్స్ ఇబ్బంది పడకుండా వాకింగ్ ట్రాక్, బెంచీలు, మొక్కల పెంపకం వంటి సౌకర్యాలను సక్రమంగా ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా రాబోయే తరాల కోసం స్థానికులందరూ పార్కులను సంరక్షించుకోవాలని ఆయన కోరారు.