ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Thu, Dec 25, 2025, 07:04 PM
రాష్ట్రంలో యాసంగి సీజన్‌లో సాగవుతున్న పంట భూములను ఉపగ్రహ చిత్రాల ద్వారా ఖచ్చితంగా గుర్తించి, దాని ఆధారంగా రైతు భరోసా పథకం అమలు చేయాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. ఉపగ్రహ చిత్రాల క్రోడీకరణ ప్రక్రియ పూర్తయిన తర్వాతే రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయాలని స్పష్టం చేశారు.ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ యాసంగిలో వాస్తవంగా సాగు చేస్తున్న భూములనే గుర్తించి రైతులకు న్యాయం చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. అందుకే ఉపగ్రహ చిత్రాల ఆధారంగా భూముల గుర్తింపు పూర్తయ్యే వరకు రైతు భరోసా నిధుల పంపిణీ ఉండదని తెలిపారు.