|
|
by Suryaa Desk | Fri, Dec 26, 2025, 10:35 AM
నిజాంపేట్: క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని నిజాంపేట్ జిహెచ్ఎంసి (NMC) సర్కిల్ పరిధిలోని క్రీస్తు కృప ప్రార్థన మందిరంలో వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. పాస్టర్ జాషువా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో క్రైస్తవ సోదరులు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ముఖ్య అతిథులు: ఈ వేడుకల్లో నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ మాజీ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ (NMC) బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.ముఖ్య అతిథులు చర్చీలో జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని, దైవ ఆశీస్సులు తీసుకున్నారు.అనంతరం పాస్టర్ జాషువా మరియు కమిటీ సభ్యులతో కలిసి క్రిస్మస్ కేక్ కట్ చేసి, అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.యేసుక్రీస్తు బోధించిన ప్రేమ, కరుణ, శాంతి మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో నాయకులు శివ, యువకులు రామ్ చరణ్,చర్చి కమిటీ సభ్యులు సంపత్, మహేష్, రాజ్ కుమార్, చందు, ప్రసాద్,భక్తులు పాల్గొన్నారు.