|
|
by Suryaa Desk | Sun, Dec 28, 2025, 01:53 PM
విదేశాల నుంచి భారతీయులను వెనక్కి పంపే దేశాల జాబితాలో అమెరికానే ముందుంటుందని చాలా మంది భావిస్తుంటారు. కానీ, వాస్తవ గణాంకాలు దీనికి భిన్నంగా ఉన్నాయి. గత ఐదేళ్లుగా భారతీయులను అత్యధికంగా బహిష్కరించిన దేశంగా సౌదీ అరేబియా నిలిచింది. ఈ విషయాన్ని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ పార్లమెంటులో వెల్లడించింది.2025 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా 81 దేశాల నుంచి 24,600 మందికి పైగా భారతీయ పౌరులను బహిష్కరించారు. వీరిలో అత్యధికంగా 11,000 మందికి పైగా సౌదీ అరేబియా నుంచే తిరస్కరణకు గురయ్యారు. ఇదే సమయంలో అమెరికా నుంచి సుమారు 3,800 మంది భారతీయులను వెనక్కి పంపారు. కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ డిసెంబర్ 18న రాజ్యసభలో ఈ వివరాలను లిఖితపూర్వకంగా తెలిపారు.