|
|
by Suryaa Desk | Mon, Dec 29, 2025, 08:51 AM
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత, ప్రతిపక్ష నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) హాజరుకానున్నారు. నేటి (డిసెంబరు 29) నుంచి జరగనున్న ఈ సమావేశాలకు తాను హాజరవుతున్నట్లు పార్టీ నేతలతో కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఆయన ఆదివారం సాయంత్రం ఎర్రవల్లిలోని తన ఫాంహౌస్ నుంచి హైదరాబాద్‌లోని నంది నగర్ నివాసానికి చేరుకున్నారు.అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై కేసీఆర్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. అధికార కాంగ్రెస్ పార్టీ ఏ ఎజెండాతో ముందుకు వస్తుందో గమనించి, దానికి అనుగుణంగా దీటుగా స్పందించాలని సూచించారు. ముఖ్యంగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై అసెంబ్లీ లోపల, బయట బలమైన పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కాగా, అసెంబ్లీ సమావేశాల కోసం కేసీఆర్ హైదరాబాద్‌కు రావడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.