బీసీ సంక్షేమ కమిటీ ఏర్పాటు, ఫెడరేషన్ చైర్మన్ల నియామకం: ఎమ్మెల్యేకు వినతి
Sat, Dec 27, 2025, 02:35 PM
|
|
by Suryaa Desk | Mon, Dec 29, 2025, 10:37 AM
రంగారెడ్డి జిల్లా, రాజేంద్రనగర్‌లోని మైలర్ దేవ్ పల్లి డివిజన్ పరిధిలో గల శ్రీ గోదా సమేత శ్రీ శాలిగ్రామ వేంకటేశ్వర దేవాలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కోసం ప్రత్యేక ఏర్పాట్లు పూర్తయ్యాయి. మార్గశిర మాస శుక్ల పక్ష ఏకాదశి సందర్భంగా, ఈ పవిత్ర దినాన ఉత్తర ద్వారం గుండా శ్రీమహావిష్ణువును దర్శించుకుంటే పాప విముక్తి కలిగి మోక్షప్రాప్తి కలుగుతుందని ఆలయ కమిటీ తెలిపింది. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్నందున, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు చేపట్టారు.