|
|
by Suryaa Desk | Thu, Jan 01, 2026, 03:19 PM
రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ జిల్లా ప్రజలకు, పోలీస్ అధికారులకు, సిబ్బందికి, మీడియా మిత్రులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2026లో సరికొత్త ఆలోచనలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రజలకు మరింత మెరుగైన పోలీస్ సేవలు అందిస్తామని, శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజలతో సమన్వయంతో పని చేస్తామని ఎస్పీ పేర్కొన్నారు. నేరాల నియంత్రణ, రోడ్డు భద్రత, మహిళలు, పిల్లల రక్షణ, సైబర్ నేరాల నివారణపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. జిల్లా ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ, పోలీస్ శాఖ ఎల్లప్పుడూ ప్రజల సేవలో ఉంటుందని హామీ ఇచ్చారు.