|
|
by Suryaa Desk | Tue, Dec 30, 2025, 12:45 PM
నూతన సంవత్సరం సందర్భంగా వచ్చే నకిలీ ఎస్సెమ్మెస్‌లు, వాట్సాప్ సందేశాలు, సోషల్ మీడియా ఖాతాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. కొత్త సంవత్సరం వేళ గిఫ్టులు, క్రెడిట్ కార్డు ఆఫర్లు, వివిధ రాయితీలు అంటూ నకిలీ లింకులు విస్తృతంగా ప్రచారమవుతున్నాయని వారు తెలిపారు. ఇలాంటి నకిలీ లింకులను క్లిక్ చేసి మోసానికి గురికావొద్దని సూచిస్తున్నారు.అనాలోచితంగా వాటిపై క్లిక్ చేస్తే మొబైల్ ఫోన్‌లలో హానికరమైన యాప్‌లు ఇన్‌స్టాల్ అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. దీనివల్ల బ్యాంకు వివరాలు, ఓటీపీలు చోరీకి గురవుతాయని హెచ్చరించారు. అనుమానాస్పద లింకులపై ఎట్టి పరిస్థితుల్లో క్లిక్ చేయవద్దని, ఒకవేళ ఏదైనా మోసం జరిగితే వెంటనే 1930కు కాల్ చేయాలని లేదా cybercrime.gov.in ద్వారా ఫిర్యాదు చేయాలని టీజీసీఎస్‌బీ డైరెక్టర్ శిఖా గోయల్ తెలిపారు.