|
|
by Suryaa Desk | Sat, Jan 03, 2026, 10:47 AM
హైదరాబాద్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఆర్థిక ఇబ్బందులతో మనోవేదన చెందిన వసంత (29) అనే తల్లి శుక్రవారం సాయంత్రం తన ఇద్దరు పిల్లలను ట్యాంక్‌బండ్‌పై కూర్చోబెట్టి, హుస్సేన్‌సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకుంది. పిల్లలకు సెల్‌ఫోన్ ఇచ్చి ఆడుకోమని చెప్పి ఆమె నీటిలో దూకింది. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని వెలికితీసి మార్చురీకి తరలించారు. అనంతరం పిల్లలను ఆమె సోదరుడికి అప్పగించారు.