|
|
by Suryaa Desk | Sat, Jan 03, 2026, 11:37 AM
TG: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు కూడా ఉచిత కరెంట్ అందిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రకటించారు. ఇప్పటికీ పథకం అందని అర్హులెవరైనా ఉంటే ఎంపీడీవో, మున్సిపల్ ఆఫీసులలో ఉండే ప్రజాపాలన అధికారులను సంప్రదించి వివరాలు ఇవ్వాలని సూచించారు. విద్యుత్తు వినియోగం 200 యూనిట్లు దాటితే ఈ పథకం వర్తించదని స్పష్టం చేశారు.