|
|
by Suryaa Desk | Sat, Jan 03, 2026, 11:46 AM
హైదరాబాద్‌లోని ఆల్విన్ ఎక్స్ రోడ్ వద్ద నడిరోడ్డుపై ఇద్దరు యువతులను ఓ మధ్య వయస్కుడు వేధించిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. సినిమా చూసి ఇంటికి వెళ్తున్న యువతులను వెంబడించి, అసభ్యకరంగా సైగలు చేస్తూ, బైక్ ఎక్కమని వేధించాడు. యువతులు నిరాకరించినా వెంటపడుతుండటంతో, వారు ఫోన్లో వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. గతేడాది అక్టోబర్‌లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు వైరల్ అవుతోంది. దీనిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.