|
|
by Suryaa Desk | Sat, Jan 03, 2026, 02:20 PM
పెద్దపల్లి సమీకృత కలెక్టరేట్ లో శనివారం సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థుల అభ్యున్నతికి చిత్తశుద్ధితో కృషి చేయాలని సూచించారు. సావిత్రిబాయి పూలే స్ఫూర్తితో విద్యార్థులలో విద్యా ప్రమాణాలు పెంచే దిశగా ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆమె అన్నారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి, జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు.