|
|
by Suryaa Desk | Sun, Jan 04, 2026, 12:00 PM
గంభీరావుపేట మండలం లింగన్నపేటకు చెందిన తమ్మనవేని భానుచందర్, సౌజన్య దంపతులకు డిసెంబరు 24న సిరిసిల్ల ఏరియా ఆసుపత్రిలో ఇద్దరు ఆడపిల్లలు జన్మించారు. అయితే, ప్రసవం తర్వాత తల్లి సౌజన్య ఆరోగ్యం విషమించడంతో కరీంనగర్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న సౌజన్య జనవరి 2న అర్ధరాత్రి మృతిచెందారు. సిరిసిల్ల ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం వల్లే సౌజన్య మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ విషాదంతో గ్రామంలో తీవ్ర సంచలనం నెలకొంది.