|
|
by Suryaa Desk | Mon, Jan 05, 2026, 10:15 AM
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం ఉదయం స్వల్ప నష్టాల్లో కదలాడుతున్నాయి. నిఫ్టీ 9 పాయింట్లు నష్టంతో 26,318 వద్దకు చేరగా, సెన్సెక్స్ 117 పాయింట్లు క్షీణించి 85,644 వద్ద ట్రేడవుతోంది. అమెరికా డాలర్ ఇండెక్స్ 98.5కు, బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 60.9 డాలర్లకు, యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్ 4.20 శాతానికి చేరాయి. గత ట్రేడింగ్ సెషన్‌లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.2 శాతం లాభపడగా, నాస్ డాక్ 0.03 శాతం పెరిగింది.