|
|
by Suryaa Desk | Mon, Jan 05, 2026, 12:05 PM
సోమవారం ఉదయం బాబుల్ రెడ్డినగర్ చౌరస్తాలో పారిశుద్ధ్య కార్మికులకు ప్లాస్టిక్ కవర్లో చుట్టిన నెలలు నిండని చిన్నారి మృతదేహం లభించింది. గుర్తుతెలియని వ్యక్తులు మృతదేహాన్ని రోడ్డుపై పడేశారని పోలీసులు తెలిపారు. మైలార్ దేవ్ పల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సీసీ కెమెరాల ద్వారా దర్యాప్తు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ సత్యనారాయణ గౌడ్ తెలిపారు.