|
|
by Suryaa Desk | Sun, Jan 04, 2026, 12:07 PM
సిద్దిపేట జిల్లా ధూల్మిట్ట గ్రామ సర్పంచ్ గునుకుల లీలా జగన్మోహన్రెడ్డి ఆడపిల్ల పుట్టిన ప్రతి ఇంటికి రూ. 5వేలు ఫిక్స్డ్ డిపాజిట్‌గా అందజేస్తున్నారు. ఈ పథకం ద్వారా పేదింటి ఆడపిల్లల భవిష్యత్ కు భరోసా కల్పించడమే లక్ష్యంగా సర్పంచ్ ముందుకు వచ్చారు. ఈ పథకాన్ని కొనసాగిస్తూనే కాంగ్రెస్ ప్రభుత్వం సహకారంతో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని సర్పంచ్ తెలిపారు.