|
|
by Suryaa Desk | Sun, Jan 04, 2026, 05:58 PM
నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలంలో దారుణం చోటు చేసుకుంది. ప్రియుడితో కలిసి భర్త రమేశ్ ను భార్య సౌమ్య హత్య చేసింది. భర్త రమేశ్ గాఢ నిద్రలోకి జారుకున్నాక అతడికి ఉరి వేసి చంపింది. అనంతరం గుండెపోటుతో చనిపోయినట్లు కుటుంబ సభ్యులను నమ్మించింది. అయితే రమేశ్ మృతిపై అనుమానంతో అతడి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మృతదేహానికి రిపోస్టుమార్టం చేశారు. దీంతో రమేశ్ ను హత్య చేసినట్లు నిర్ధారణ అయింది. పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడింది.