|
|
by Suryaa Desk | Mon, Jan 05, 2026, 07:42 PM
బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ తర్వాత, జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఈ నెల 6, 7 తేదీల్లో సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. తన అన్న నియోజకవర్గంలో ఆమె పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మొదటి రోజు తంగళ్ళపల్లి, సిరిసిల్ల పట్టణం, కోనరావుపేట, వీర్నపల్లి, ఎల్లారెడ్డిపేట మండలాల్లో కవిత పర్యటన సాగనుంది. జాగృతి నేతలు దీనికి సంబంధించిన ఏర్పాట్లను ముమ్మరంగా చేస్తున్నారు.