|
|
by Suryaa Desk | Tue, Jan 06, 2026, 06:29 PM
స్మార్ట్‌ఫోన్ వాడకం ఎక్కువై ఛార్జింగ్ త్వరగా అయిపోతోందని బాధపడే వారికి ఒప్పో తీపి కబురు అందించింది. ఏకంగా 7,000mAh బ్యాటరీతో కూడిన తన సరికొత్త స్మార్ట్‌ఫోన్ 'ఒప్పో A6 ప్రో 5G'ని సోమవారం భారత మార్కెట్లో విడుదల చేసింది. భారీ బ్యాటరీతో పాటు వేగవంతమైన ఛార్జింగ్, అత్యాధునిక ఫీచర్లతో మధ్యతరగతి వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని ఈ ఫోన్‌ను రూపొందించింది. ఈ ఫోన్ ప్రధాన ఆకర్షణ దీని బ్యాటరీ సామర్థ్యం. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 40 రోజుల పాటు స్టాండ్‌బై పవర్‌ను ఇది ఇస్తుందని కంపెనీ పేర్కొంది. అంత పెద్ద బ్యాటరీని వేగంగా ఛార్జ్ చేయడానికి వీలుగా 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయాన్ని కల్పించారు. దీనివల్ల కేవలం 64 నిమిషాల్లోనే సున్నా నుంచి వంద శాతం ఛార్జింగ్ పూర్తి చేసుకోవచ్చు.