|
|
by Suryaa Desk | Sun, Jan 04, 2026, 03:51 PM
మరిపెడ మున్సిపల్ కేంద్రంలో జరిగిన సిపిఐ మండల కౌన్సిల్ సమావేశంలో, సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు నల్లు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ప్రగతిశీల నాయకులను, ప్రజా ఉద్యమాలను అణిచివేసే చర్యలకు స్వస్తి పలకాలని డిమాండ్ చేశారు. వందేళ్లుగా త్యాగాల చరిత్రతో ప్రజా హక్కుల కోసం పోరాడుతున్న ఏకైక పార్టీ సిపిఐ అని, బీజేపీ మతతత్వ విధానాలను, పబ్లిక్ రంగాన్ని ధ్వంసం చేస్తూ కార్పొరేట్లకు దాసోహమై దేశ సంపదను దోచిపెడుతున్న విధానాలను ప్రతిఘటించాలని అన్నారు. రాబోయే రోజులలో ప్రగతిశీల శక్తులు ఐక్యంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు.